
కుబేర సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఆ రేంజ్ లో ఉండింది . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన సినిమా ఎంత పెద్ద పాజిటివ్ టాక్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. రికార్డులు పరంగా కూడా అన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుంది . బ్లాస్టింగ్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది. చాలామంది ధనుష్ పర్ఫామెన్స్ ని పొగిడేస్తున్నారు . ఇలాంటి మూమెంట్ లోనే ధనుష్.. ఏ డైరెక్టర్ తో వర్క్ చేయపోతున్నాడు అనే విషయం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ధనుష్ తన నెక్స్ట్ సినిమాని కూడా తెలుగు డైరెక్టర్ తోనే ఫిక్స్ అయ్యాడు అంటూ తెలుస్తుంది . ఆయన మరెవరో కాదు బోయపాటి శ్రీను . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ అనగానే అందరికీ ఈయన పేరు గుర్తొస్తుంది. కాగా ధనుష్ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇది పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతుందట. గతంలో భద్ర సినిమా లెవెల్ లోనే ఈ కథను రాసుకున్నారట . బోయపాటి శ్రీను ఆల్రెడీ కధ వివరించారట . ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయినట్లే అని తెలుస్తుంది . అన్ని ఓకే అంటే మాత్రం అఖండ 2 సినిమా షూట్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!