
టీజర్ విషయానికి వస్తే.. సత్యదేవ్ మొదట భారీ గడ్డంతో మీసాలతో జుట్టుతో చాలా వికారంగా కనిపిస్తారు. ఆ తర్వాత ఆచారి నాకు భూతం పట్టిండాది. అంటూ ఆసక్తికరమైన డైలాగుతో టీజర్ మొదలవుతుంది. ఇందులో చాలా విభిన్నమైన పాత్రలలో సత్యదేవ్ కనిపించబోతున్నారు. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా కథ అన్నట్లుగా కనిపిస్తోంది. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కించిన రావు బహదూర్ సినిమా టీజర్ చాలా కొత్తగా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
సత్యదేవ్ నటన కూడా ఇందులో అద్భుతంగా నటించినట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయినట్లుగా కనిపిస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ ను ఇష్టపడేవారు ఈ సినిమా ఖచ్చితంగా సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం కూడా నమ్మకంతో ఉన్నారు. వచ్చే వేసవి సెలవులను టార్గెట్ చేసుకొని రావ్ బహదూర్ ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హీరో సత్యదేవ్ కెరియర్ లోనే ఈ సినిమా మరొక మైలురాయిగా అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. హీరోయిన్ కూడా చాలా విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే ఈ ట్రైలర్ వైరల్ గా మారుతున్నది.