ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులపై కపట ప్రేమ చూపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడమే హరీష్ లక్ష్యమని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై హరీష్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేక విషం కక్కుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో తన స్థానం కోల్పోతామన్న అక్కసుతో హరీష్ అనవసర విమర్శలు చేస్తున్నారని, పదేళ్లలో సెక్రటేరియట్‌కు రాని తన మామ కేసీఆర్‌పై నోరు మెదపని హరీష్, 18 గంటలు పనిచేసే సీఎంపై నిందలు వేస్తున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే 61.45 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. 2022-23లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని, దీనిపై హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి 8,245 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు వెంటనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు.

అకాల వర్షాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాల కొరత, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. కల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను హరీష్ మరిచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, ఒక్క ఏడాదిలోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తమదని ఉద్ఘాటించారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: