
ఇది ఒక రహస్య ఒప్పందం తప్ప మరేమీ కాదు” అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశం అయ్యాయి. రాజ్ నాధ్ ఫోన్ కాల్ .. ఇప్పటికే బీజేపీ కేంద్ర నేతలు ఉప రాష్ట్రపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మెజారిటీ ఉన్నా, అది చాలదు… బంపర్ విక్టరీ కావాలి అన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ స్వయంగా జగన్‌కి ఫోన్ చేసి, “మా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి” అని కోరారు. దీంతో వైసీపీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. జగన్ దిశ ఏంటి? .. ఇక ఏపీలో చూస్తే బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం వైసీపీపై విరుచుకుపడుతున్నారు. కొత్త రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ సైతం “లిక్కర్ స్కామ్‌లో జగన్ జైలుకి వెళ్తారు” అంటూ ఫైరయ్యారు.
కానీ కేంద్ర స్థాయిలో మాత్రం బీజేపీ – వైసీపీ మధ్య బంధం అంతా సజావుగానే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే రెండు పార్టీలు లోపాయికారి డీల్ చేసుకున్నాయా? అనే సందేహాలను పెంచుతోంది. వైసీపీ లాభనష్టాల లెక్కలు .. బీజేపీకి మద్దతు ఇస్తే జాతీయ స్థాయిలో మంచి సంబంధాలు కుదురుతాయి. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ దానిని ఓటు బ్యాంక్ పై దాడిగా మార్చేస్తుంది. ఇంకో వైపు, “ఉప రాష్ట్రపతి పదవి రాజకీయమా? రాజ్యాంగ పదవికదా, అందుకే మద్దతు ఇవ్వాలి” అనే వాదన కూడా వైసీపీలో వినిపిస్తోంది. మొత్తానికి, వైసీపీ ఏ దిశలో వెళ్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఏపీలో కొత్త రాజకీయ అలజడులు తెచ్చే అవకాశం మాత్రం ఖాయం.