భారత దేశంలో  కాశీ  అంటే ఒక పవిత్ర స్థలంగా భావిస్తారు. ముఖ్యంగా ఈశ్వరుడికి కాశి అంటే ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ చనిపోయిన వారిని దహనం చేస్తే స్వర్గానికి చేరుతారని నమ్ముతారు. సంవత్సరంలో 365 రోజులలో కాశీలో చితి మంటలు ఆరిన  సందర్భం అయితే ఉండదు. ఎప్పుడు చితిమంటలు మండుతూనే ఉంటాయి. అలాంటి కాశీలో దహనం కావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి.. గరుడ పురాణం ప్రకారం  కాశీలో మాత్రం ఈ ఐదుగురిని అస్సలు దహనం చేయరట.. మరి వారు ఎవరు ఆ వివరాలు చూద్దాం.. గరుడ పురాణం ప్రకారం సాధువులు, ఋషుల శరీరాలను అస్సలు దహనం చేయరు.. వీరిని జల సమాధి చేసే సంప్రదాయం ఉంది.

 ఇక వీరినే కాకుండా గర్భంతో ఉన్న స్త్రీలను కూడా కాశీలో దహనం చేయరు. దానికి కారణం కడుపుతో ఉన్న వారి పొట్ట ఉబ్బిపోయి ఉంటుంది.ఒకవేళ అక్కడ దహనం చేస్తే పగిలిపోతుందని అందుకే వారిని తస్లీ సమాధి చేయాలనే నియమం ఉంది.. అలాగే 11 ఏళ్ల కంటే తక్కువ వయసున్నటువంటి పిల్లల మృతదేహాలను కూడా దహనం చేయరు.. వారిని కూడా  సమాధి మాత్రమే చేయాలని గరుడ పురాణం చెబుతోంది .ఇక అంటువ్యాధులు సోకినటువంటి వారిని కూడా కాశీలో దహనం చేయరట..

ఇందులో ముఖ్యంగా కుష్టు వ్యాధి లేదా చర్మ వ్యాధితో మనిషి మరణిస్తే అతని మృతదేహాన్ని  ఖననం చేస్తే అందులో ఉండే సూక్ష్మ క్రిములు గాలిలో కలిసి మిగతా వారికి బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉందని అందుకే వారిని దహనం చేయరని చెబుతారు. అలాగే పాముకాటుకు గురైన వ్యక్తులను కూడా దహనం చేయరట. గరుడ పురాణం ప్రకారం పాముకాటు వల్ల మనిషి శరీరంలోకి విషం  వెళ్తుందని, అలా ఆ విషం ఆ వ్యక్తి శరీరంలో 21 రోజులపాటు సూక్ష్మజీవులు ఉంటాయని వారిని ఖననం చేయకుండా సమాధి చేస్తారని గరుడ పురాణం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: