ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'స్కోడా' (Skoda) ఎట్టకేలకు తన పాపులర్ SUV స్కోడా కుషాక్ (Skoda Kushaq) ధరలను రూ. 70,000 దాకా పెంచింది. ఇండియన్ మార్కెట్లో ఈ SUV కి ఉన్న డిమాండ్ ఇంకా అలాగే ఇన్‌పుట్ ఖర్చులు కారణంగా ధరలు పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.ఇక ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్లో కుషాక్ (Kushaq) ధరలు పెరగడం ఇది వరుసగా రెండవ సారి. దీనిని బట్టి చూస్తే ఈ SUV కార్ కి దేశీయ విఫణిలో ఎంత డిమాండ్ ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. స్కోడా కంపెనీతో పాటు దేశీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా తన టైగన్ SUV ధరలను కూడా పెంచడం జరిగింది.ఇక స్కోడా కంపెనీ ఇటీవలే కుషాక్ SUV లో రెండు కొత్త వేరియంట్స్ విడుదల చేసింది. ఇందులో ఒకటి 'కుషాక్ యాక్టివ్ పీస్' కాగా మరొకటి వచ్చేసి 'కుషాక్ యాంబిషన్ క్లాసిక్' వేరియంట్స్. ఇప్పుడు కుషాక్ స్టార్టింగ్ ధర వచ్చేసి రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుంచి ఉంటుంది.



ఇక కంపెనీ అందించిన సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, స్కోడా కుషాక్ యాక్టివ్ 1.0 లీ టిఎస్ఐ ధర వచ్చేసి రూ. 30,000 పెరిగింది. కాబట్టి ఈ మోడల్ ధర ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో రూ. 11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది. అదే విధంగా యాంబిషన్ 1.0 లీ టిఎస్ఐ ధర వచ్చేసి రూ. 20,000 పెరిగి రూ. 12.99 లక్షలకు చేరింది.అలాగే ఇక కుషాక్ స్టైల్ 1.0లీ టిఎస్ఐ వేరియంట్ ధర రూ. 40,000 ఇంకా స్టైల్ 1.5లీ టిఎస్ఐ ధర రూ. 70,000 పెరిగాయి. ఇప్పుడు వీటి ధరలు వరుసగా రూ. 14.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఇంకా రూ. 16.49 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఇండియా) చేరాయి.ఇక అదే విధంగా యాంబిషన్ 1.0 లీ టిఎస్ఐ వేరియంట్ ధర వచ్చేసి రూ. 40,000 ఇంకా స్టైల్ 1.5 లీ టిఎస్ఐ డిఎస్జి ధర రూ. 60,000 పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: