రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తొలగించే పానీయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అల్లం ఇంకా నిమ్మరసం ఎంతగానో సహాయపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. దీని కోసం ఒక గ్లాస్ లో ఒక టీ స్పూన్ అల్లం రసం ఇంకా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ఈజీగా తొలగిపోతుంది. అదే విధంగా ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ పసుపు వేసి రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పాలల్లో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వెల్లుల్లి కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. రక్తాన్ని పలుచగా చేసి రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ తేనె ఇంకా రెండు వెల్లుల్లి రెబ్బల చూర్ణాన్ని వేసి కలిపి పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉసిరికాయ రసం కూడా బాగా తోడ్పడుతుంది.


ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఒక పెద్ద ఉసిరికాయ నుండి తీసిన రసాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉసిరి, బిభితకీ, హరితకి అనే త్రిఫలాల నుండి తయారు చేసిన త్రిఫలా చూర్ణాన్ని తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఖచ్చితంగా అదుపులో ఉంటాయి.ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫలా చూర్ణాన్ని వేసి 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఈ టీని వడకట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇక అశ్వగంధ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని వేసి 5 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఈ టీని వడకట్టి పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఈ విధంగా ఈ పానీయాలను తయారు చేసుకుని తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: