
చలికాలంలో వచ్చే ముక్కు దిబ్బడ, ముక్క పట్టేసినట్టు ఉండే సమస్యలు తగ్గాలంటే వేడిగా ఉండే నీటిని తాగాలి.దానితో ముక్కులోని శ్లేష్మాలు పలుచబడి ముక్కు దిబ్బడ తగ్గుతుంది. తరువాత వేడి నీటిలో యూకలిప్టస్ నూనెను లేదా పెప్పర్ మెంట్ నూనెను, పసుపును వేసి ఆవిరి పట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ క్రమంగా తగ్గుతుంది.
తరువాత ముక్కు బిగుసుకుపోయినా ముక్కుతోనే వీలైనంత ఎక్కువగా గాలి పీల్చడానికి ప్రయత్నించాలి. ముక్కతో ఎక్కువగా గాల్చి పీల్చడం వల్ల ముక్కలో ఉన్న శ్లేష్మాలు ఆవిరైపోతాయి. ఇలా చేసిన తరువాత ముక్కు కొద్దిగా గాలి ఆడినట్టు ఉంటుంది. తరువాత 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మనం చాలా త్వరగా ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం పొందవచ్చు. లేదంటే ముక్కు నుండి నీరు కారుతూ, జలుబు చేసినట్టు రోజంతా అలాగే ఉంటుంది.ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉదయాన్నే చాలా మంది టీ, కాఫీలను తీసుకుంటువుంటారు.
కానీ పరగడుపున టీ, కాఫీలను తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యల వచ్చే అవకాశం ఉటుంది.కావునా మాటిమాటికి యాంటీ బయాటిక్స్ వాడకుండా,సహజ చిట్కాలను వాడి మనం ముక్కు దిబ్బడను తొందరగా ఉపశమనం పొందవచ్చు.ఈ సీజన్ లో వచ్చే బ్యాక్టీరియల్ వ్యాధులను తగ్గించుకోవడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. కావున అల్లం వేసిన పాలు త్రాగటం, విటమిన్ సి వున్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయాలి.