బుల్లితెరపై తెగ ఫేమస్ అయిన జోడిలలో రష్మీ సుధీర్ మొదటి స్థానంలో ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో ప్రారంభమైన వీరి లవ్ ట్రాక్ ప్రస్తుతం బుల్లితెర మొత్తం పాకిపోయింది అని చెప్పాలి. అంతేకాదండోయ్ ఇక వీరి ప్రేమ ప్రయాణం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఒకరిపై ఒకరికున్న ప్రేమను వ్యక్తం చేయడం.. వీరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసి బుల్లితెర ప్రేక్షకులు తెగ ఆనందపడి పోతూ ఉంటారు అని చెప్పాలి. అందుకే వీరిద్దరూ కలిసి ఎప్పుడు బుల్లితెర మీద కనిపించిన కూడా ఆ షో రేటింగ్ అమాంతం పెరిగి పోతూ ఉంటుంది.


 అంతేకాదండోయ్ ఇద్దరి జోడి ని చూస్తూ ఎంతగానో ఆనందపడే అభిమానులు.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. కేవలం షో కోసం మాత్రమే తాము అలా చేస్తున్నామని తాము కేవలం స్నేహితులం మాత్రమే అని ఇద్దరు ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం వీరు నిజంగా ప్రేమికులని నమ్మకుండా ఉండలేకపోతున్నారు. కాగా సోషల్ మీడియాలో ఒక చాట్ సెషన్ లో పాల్గొన్నాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ రష్మీ పెళ్లి గురించి ఎక్కువగా ప్రశ్నలు ఎదురయ్యాయి.


 ఈ క్రమంలోనే ఆసక్తికర సమాధానం చెప్పాడు గెటప్ శ్రీను. సుధీర్ కి గెటప్ శ్రీను బెస్ట్ ఫ్రెండ్ కావడంతో రష్మీని సుధీర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఒక నెటిజన్ అడిగాడు. ఈ క్రమంలోనే స్పందించిన గెటప్ శ్రీను సుధీర్ రష్మీ పెళ్లి చేసుకోరు.. షూటింగ్ అయిన తర్వాత రష్మీ ది వేరే లోకం. సుధీర్ ది వేరే లోకం.. కేవలం ప్రేక్షకులను రంజింప చేయడం కోసం మాత్రమే వారు తెరపై లవర్స్ లా నటిస్తారు. కానీ వాళ్లు రియల్ లవర్స్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే గత కొన్ని రోజుల క్రితమే గెటప్ శీను, సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా సుధీర్ స్టార్ మా లో యాంకర్ గా అవతారం ఎత్తితే.. గెటప్ శ్రీను సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: