రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  త్రిబుల్ ఆర్ సినిమాలో సీతారామరాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. మొన్నటి వరకు అంతర్జాతీయ వేదికలపై సందడి చేసి అలరించాడు. అయితే ఇక ఇప్పుడు తన క్రేజ్ కి తగ్గట్లుగానే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం మరో క్రేజీ డైరెక్టర్ అయిన శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు గేమ్ చేజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇక వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే మరో డైరెక్టర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. ఉప్పెన సినిమాను తీసి మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాతో సినిమాకు రెడీ అయ్యాడు రామ్ చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఇక ఈ మూవీ ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ రోల్ లో నటించబోతున్నాడట.


 ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం గేమ్ చేంజర్ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ప్రారంభించాల్సి ఉంది. కానీ గేమ్ చేంజెర్ షూటింగ్ సమయంలోనే.. హీరోయిన్ కీయరా అద్వానీ వివాహం మరియు చరణ్ భార్య గర్భం దాల్చడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఉపాసన డెలివరీ ఉంది. దీంతో ఇక చరణ్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ గ్యాప్ లో నటీనటుల ఎంపికపై బుచ్చిబాబు దృష్టి పెట్టాడట. ఎంపిక విషయంలో త్రిబుల్ ఆర్ ఫార్ములానే బుచ్చిబాబు ఫాలో అవుతున్నాడట. పాన్ ఇండియా సినిమా కావడంతో రాజమౌళి అన్ని భాషల్లో క్రేజ్ ఉన్న నటులను ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా హిందీ తమిళ నటులతో పాటు మరాఠీ నటులను కూడా ఇక సినిమాలోకి తీసుకోవాలని అనుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: