టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు . ఈయన ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని , టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సినిమాలు కమర్షియల్ గా విజయాలను సాధించకపోయినా విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలు అందుకున్నాయి.

దానితో సుకుమార్ దర్శకత్వంలో పని చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు అంతా కూడా పోటీ పడుతూ ఉంటారు. అంత క్రేజ్ కలిగిన దర్శకుడి సినిమాను నితిన్ మాత్రం ఓ చిన్న కారణంతో రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించే కంటే ముందు పెద్దగా ఏ దర్శకుల దగ్గర పని చేయలేదు. కానీ నితిన్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్ సినిమాకు మాత్రం పని చేశాడు. దిల్ సినిమా పనులు జరుగుతున్న సమయంలో ఒకానొక సందర్భంలో సుకుమార్ , నితిన్ కి ఆర్య మూవీ కథను వినిపించాడట.

కథ మొత్తం విన్న నితిన్ కు ఆ స్టోరీ బాగున్న అప్పటికే నాలుగు సినిమాలకు కమిట్ అయి ఉండడంతో ఇప్పుడు ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో సుకుమార్మూవీ కథను అల్లు అర్జున్ కు వినిపించడం , ఆయనకు ఆ స్టోరీ అద్భుతంగా నచ్చడంతో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఇక ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ తో ఇటు బన్నీ కి , అటు సుకుమార్ కి మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: