ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ "పెద్ది" అనే పవర్ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ , చరణ్ కి జోడిగా నటిస్తోంది. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... జగపతి బాబు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మూవీ షూటింగ్ ఎంత స్పీడ్ గా జరుగుతుందో ఈ మూవీ కి సంబంధించిన అప్డేట్లను కూడా మేకర్స్ అంతే స్పీడ్ గా విడుదల చేస్తూ వస్తున్నారు. కొంత కాలం క్రితం ఈ సినిమా నుండి ఓ గ్లీమ్స్ వీడియోను విడుదల చేయగా అది ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత కూడా కొన్ని చరణ్ కు సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫోటోలను మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటిస్తున్న దివ్యాందు పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఆది ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా పని చేస్తున్న రత్నవేలు ఈ మూవీ గురించి ఒక అప్డేట్ తెలియజేస్తూ ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు.

అందులో ఈయన ప్రస్తుతం పెద్ది సినిమాకు సంబంధించిన ఒక అద్భుతమైన నైట్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాం. అది అద్భుతంగా వస్తోంది అని చెప్పుతూ ... చరణ్ మరియు రత్నవేలు కలిసి ఉన్న ఒక ఫోటోను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అది ప్రేక్షకులను సూపర్ గా ఆకట్టుకుంటుంది. రత్నవేలు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: