విజయ్ దేవరకొండ కి తాజాగా యాక్సిడెంట్ అయింది.. అయితే ఈ యాక్సిడెంట్ లో విజయ్ దేవరకొండ కి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆయన కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది.. ఇక విషయంలోకి వెళ్తే..విజయ్ దేవరకొండ తాజాగా పుట్టపర్తి జిల్లాలోని సత్యసాయి బాబా మహా సమాధిని తన ఫ్యామిలీతో కలిసి దర్శించుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మహా సమాధిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ కి వస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి దగ్గరలో బొలెరో వాహనం ఒక్కసారిగా కుడివైపుకు టర్న్ అవ్వడంతో ఆ బొలెరో వాహనం వెనకాలే ఉన్న విజయ్ కి సంబంధించిన లెక్సస్ మోడల్ కార్ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. 

అయితే ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండకు ఆయన ఫ్యామిలీకి ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ ఆయన కారు మాత్రం కొంచెం దెబ్బతింది. దాంతో వెంటనే అప్రమత్తమైన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ అక్కడ నుండి వేరే వాహనంలో ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు ఈ విషయం గురించి మాట్లాడుతూ రష్మిక మందన్నా తో ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి విజయ్ దేవరకొండ కారుకి ఇలా ప్రమాదం జరగడంతో చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఫస్ట్ టైం బయటికి వస్తే ఇలా జరగడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అంతే కాదు మరి కొంతమంది ఎంగేజ్మెంట్ తర్వాత ఇలాంటి అపశకునం జరగడం ఏంటి అని ఇలా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అయితే మరి కొంతమంది ఏమో ఈ కామెంట్లను తిప్పికొడుతూ కారు ప్రమాదాలు జరగడం అనేది కామనే.ఈ యాక్సిడెంట్ లో ఆయనకు ఏమైనా గాయాలు అయితే నిజంగా ఎంగేజ్మెంట్ అపశకునం అనుకోవచ్చు.కానీ కారు పాడైంది ఫ్యామిలీకి ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ అక్టోబర్ 3న జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: