
ఇటీవల కాలంలో దేశంలో ఎన్నో చోట్ల వరుస అత్యాచారాలు జరుగుతూ వచ్చాయి. కొంత మంది కామాంధులకు కఠిన శిక్షలు పడ్డాయి.. మరికొంత మంది ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి చట్టంలోని లొసుగులను వెతుకుతూ తప్పించుకుంటున్నారు. తాజాగా మైనర్ బాలికపై అత్యాచారం కేసులు జైలుశిక్ష అనుభవిస్తున్న రాబిన్ వడక్కుంచేరి అనే ఖైదీ కేరళ హైకోర్టుకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆమెను తాను అత్యాచారం చేశాను.. ఆమెను పెళ్లి చేసుకుంటా నాకు శిక్ష నుంచి విముక్తి కల్పిస్తారా అంటూ కోర్టుకు బంపర్ ఆఫర్ వవ్వడంతో చర్చనీయాంశం అయ్యింది. అయితే, రాబిన్ వడక్కుంచేరి ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. 20 ఏళ్ల జైలుశిక్ష నుంచి మినహాయింపు పొందడం కోసం పిటిషనర్ ఎత్తుగడ వేస్తున్నాడని కోర్టు అభిప్రాయపడింది.
ఇప్పుడు పిటిషనర్ ప్రతిపాదనను అంగీకరిస్తే ఇక నుంచి ప్రతి అత్యాచార దోషి బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటూ శిక్షలు తప్పించుకునే అవకాశం ఉందని, అందువల్ల అలాంటి సంప్రదాయన్ని తాము ప్రోత్సహించబోమని కోర్టు స్పష్టంచేసింది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రాబిన్ తన కారణంగా అమెకు జన్మించిన చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటానని చెప్పాడు. పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడం కోసం తనకు రెండు నెలలు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు కూడా తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉందని పిటిషనర్ రాబిన్ కోర్టుకు తెలిపాడు.
అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసిన పోలీసులు సైతం బాధితురాలు ప్రస్తుతం తిరిగి చుదువుకుంటున్నదని, తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. కాగా, కేరళలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న రాబిన్ వడక్కుంచేరి 2016లో 16 ఏండ్ల బాలికను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలికకు ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డను కూడా కన్నది. అనంతరం తనకు సంబంధం లేదని చర్చి ఫాదర్ ముఖం చాటేయడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.