
అత్యవసరమైనటువంటి ఆహార ధాన్యాలు, సంబంధ ధాన్యాలు, వాణిజ్యపంటలు మొదలగు వాటి విషయంలో రాష్ట్రంలో నిర్లక్ష్యం జరుగుతూ కేవలం వరి పంట పైనే దృష్టి పెట్టడం జరిగింది. అనాదిగా జరుగుతున్న ఈ పద్ధతి కారణంగా కొన్ని రకాల గింజలు, ధాన్యాలు పంటలు అందుబాటులో లేక అసమతుల్యత ఏర్పడుతుంది. అలాంటప్పుడు అత్యవసరమైన పంటలను ఎంపిక చేసి పండించడానికి రైతులను ప్రోత్సహించడం ద్వారా కొరత ఉన్నటువంటి ఆ రకాలను అవసరానికి సరిపోయే స్థాయిలో పండించుకోవచ్చు కదా..! ఈ ఆలోచన వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో ప్రభుత్వం ఏనాడైనా చర్చించినదా..? అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసినదా..? అందుకే రాష్ట్రంలో నీతిమంతమైన సుపరిపాలన ప్రజలకు అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు అఖిల పక్షాలు ప్రజా సంఘాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి పెద్దరికాన్ని చాటుకోవాలి . సమస్యలపైన ఏకాభిప్రాయానికి రావాలి .అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించే ప్రభుత్వాలుగా మనగలుగుతాయి.