
అయితే ఇప్పటికే ఇలా భారీ కరెంట్ బిల్లుతో సామాన్యుల జోబుకు చిల్లు పడుతూ ఉంటే ఇవి చాలదు అన్నట్టు కొన్ని కొన్ని సార్లు విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఏకంగా వేల రూపాయల్లో వచ్చే కరెంటు బిల్లు కాస్త లక్షల రూపాయల్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చూసి సామాన్య ప్రజలు షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఇలా కరెంటు బిల్లు ఎక్కువ రావడం చూసాము. కానీ తక్కువ రావడం ఇప్పటివరకు చూడలేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ మొదటిసారి ఇలాంటి కరెంట్ బిల్లు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే ఈ తక్కువ వచ్చిన కరెంటు బిల్లు ఇప్పటిది కాదు లెండి ఏకంగా 1940లో స్వాతంత్రం రాకముందు నాటి కరెంటు బిల్లుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారిపోయింది. ముంబైలోని ప్రభుత్వేతర సంస్థకు ఎంత కరెంటు బిల్లు వచ్చిందో తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏకంగా ఒక నెల అంతా కరెంటు వినియోగించినందుకుగాను కేవలం మూడు రూపాయల 10 పైసలు మాత్రమే బిల్లు వచ్చింది. ఇక పన్నులతో కలిపి కరెంట్ బిల్లు మొత్తం ఐదు రూపాయల 20 పైసలు అయింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.