అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు చోట్ల గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాలలో పోటీ చేశాడు. కానీ అభిమాన గణం ఓట్లు వేయకపోవడంతో స్వల్ప మెజారిటీతో పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యాడు జనసేనాని. ఇక పార్టీ మొత్తానికి గెలిచిన ఒకే ఒక సీటు రాజోలు నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్. కానీ ఆ తర్వాత ఈయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు. కాగా రానున్న ఎన్నికలలో అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవుతాడా అని సొంత పార్టీ నేతలు మరియు రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు.
అయితే జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈసారి రెండు చోట్ల కాకుండా కేవలం ఒక చోటు నుండే పోటీ చేస్తాడని, అది కూడా భీమవరం నియోజకవర్గం నుండి మాత్రం పోటీ చేస్తారట. తాజాగా పవన్ మరియు చంద్రబాబు ల భేటీ అనంతరం వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ ఖచ్చితంగా పొత్తులు పెట్టుకునే ఎన్నికలకు వెలుతారన్నది స్పష్టం అవుతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లు సాధిస్తుంది అన్న విషయం పక్కన పెడితే ఈ రెండు కారణాల వలన పవన్ కళ్యాణ్ గెలుపు బావుటా ఎగురవేస్తాడని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. మరి వాస్తవంగా ఏమి జరగనుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి