కల్వకుంట్ల కవిత వ్యవహారంపై గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ పై ఏ గులాబీ నేత కూడా మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేశారట. గత మూడు రోజులుగా కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ నేపథ్యంలో... కేటీఆర్ ను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ సందర్భంగా... కేటీఆర్ తో దాదాపు రెండు గంటలపాటు కేసీఆర్ సమావేశం అయినట్లు తెలుస్తోంది.

 గత పది సంవత్సరాల కాలంలో తన కొడుకు కేటీఆర్ ను ఇలా ప్రత్యేకంగా పిలిపించుకొని కేసీఆర్ సమావేశం అయిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ప్రత్యేకంగా హరీష్ రావు అలాగే.. కల్వకుంట్ల తారక రామారావు  లతో వరుసగా కెసిఆర్ సమావేశాలు అవుతున్నారు. అయితే నిన్నటి రోజున కేటీఆర్ తో సమావేశమై... చాలా ఘాటుగా స్పందించారట కేసీఆర్. కల్వకుంట్ల కవిత ఇష్యూను తనకు వదిలివేయాలని.. నేను డీల్ చేస్తానని కెసిఆర్ స్పష్టం చేశారట.

 ఈ అంశంపై ఏ గులాబీ నేత కూడా స్పందించకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఒకవేళ మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని తెలిపారట. అదే సమయంలో కల్వకుంట్ల కవితకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేందుకు కేసిఆర్ ఇష్టపడడం లేదని సమాచారం అందుతుంది. పార్టీ ఎవరి జాగిరి కాదు... చాలా జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచనలు చేశారట. ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడితే కుదరదని.. తేల్చి చెప్పారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: