
భారతీయ జనతా పార్టీలో గులాబీ పార్టీని విలీనం చేసే కుట్ర జరుగుతుందని... తాను జైలుకు వెళ్ళినప్పుడు ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్లు స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. అలాగే తనను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపలేరని కూడా బాంబు పేల్చారు కల్వకుంట్ల కవిత. ఇలాంటి నేపథ్యంలో.. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లైన్ లోకి వచ్చారు. కల్వకుంట్ల కవిత చెప్పిందంతా వాస్తవమే అంటూ.. రాజాసింగ్ చెప్పుకొచ్చారు. డబ్బులు ఇస్తే మా పార్టీ వాళ్లు కూడా గులాబీ పార్టీలో చేరిపోతారని బాంబు పేల్చారు.
చాలా మంది బిజెపి పార్టీ నేతలు... టికెట్ కోసం గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. అందుకే తమ పార్టీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని... వెల్లడించారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. వచ్చే ఎన్నికల్లోపు... చాలా మంది గులాబీ పార్టీ లోకి వెళ్తారని కూడా గుర్తు చేశారు. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు