
కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో ఆర్థికసాయం కోసం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడం జరిగింది.
దీంతో వైద్య ఖర్చులకు గాను రూ. 10 లక్షల వరకు ఎల్ వోసీ మంజూరు చేయడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అధిక మొత్తం అవసరం కావడం తో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయాన్ని రూ.15 లక్షల వరకు పెంచి ఎల్ వోసీ మంజూరు చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని వెంటనే కలుసుకుని సాయం అందజేయడం గొప్ప విషయమని, ఒక్క రోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు