ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. రేపు ఒక్కరోజు అయితే ఆదివారం ఈ మ్యాచ్ మొదలైపోతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టైటిల్ కోసం ఇండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్ జట్టు ఈసారి గెలిస్తే రికార్డు స్థాయిలో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడనుంది.

ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే.. వాళ్లు రెండోసారి టైటిల్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకుముందు 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. అయితే ఒకవేళ మ్యాచ్ జరుగుతుండగా వర్షం వస్తే ఏంటి పరిస్థితి? మ్యాచ్ టై అయితే ఏం చేస్తారు? ఆ విషయాలే ఇప్పుడు తెలుసుకుందాం.

• మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ గ్యారెంటీ:

భారత్, న్యూజిలాండ్ జట్లు రెండూ సమానంగా పరుగులు చేస్తే.. అప్పుడు సూపర్ ఓవర్ తో విజేత ఎవరో తేలుస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే.. మళ్లీ సూపర్ ఓవరే. విజేత ఎవరో తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడుతూనే ఉంటారు. ఇంతకుముందు బౌండరీలు ఎక్కువగా కొట్టిన జట్టును విజేతగా ప్రకటించేవారు. కానీ 2019 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడానికి ఆ రూలే కారణం. అప్పుడు చాలా కాంట్రవర్సీ అయ్యింది. అందుకే ఇప్పుడు ఆ రూల్ తీసేశారు. బౌండరీలు లెక్కించే పద్ధతికి స్వస్తి పలికారు.

* వర్షం వస్తే.. కప్పు పంచుకోండి!

ఇప్పటికే ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. కానీ దుబాయ్ లో వాతావరణం పొడిగా ఉంటుంది కాబట్టి ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ తక్కువే. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దయితే.. అప్పుడు రెండు జట్లకూ ఛాంపియన్స్ ట్రోఫీ కప్పును పంచుతారు. ఇద్దరూ విజేతలే.

ఇలా ఇంతకుముందు కూడా జరిగింది. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. కానీ వర్షం రావడంతో రెండు రోజులు మ్యాచ్ ఆడినా ఫలితం తేలలేదు. దీంతో రెండు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

ఇకపోతే భారత జట్టు ఫుల్ ఫామ్ లో ఉంది. వరుసగా ఏడు వన్డేల్లో గెలిచి దూకుడు మీదుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ ను ఓడించింది. అయితే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా డేంజర్ గా ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో వాళ్లు తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. కానీ వాళ్ళకు అసలు సిసలైన సవాల్ మాత్రం ఇండియా స్పిన్ ఎటాక్ ను ఎదుర్కోవడమే. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలం ముందు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఎలా ఆడతారో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఆడినప్పుడు వరుణ్ ఏకంగా ఐదు వికెట్లు తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: