బురుండీ అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా (55) గుండెపోటుతో మృతిచెందారు. మంగ‌ళ‌వారం సాయంత్రం ఎన్‌కురింజిజా మ‌ర‌ణించిన‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గత శ‌నివారం మ‌ధ్యాహ్నం వాలీబాల్ ఆడిన బురుండీ ప్రెసిడెంట్ అదేరోజు సాయంత్రం తీవ్ర  అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం కోలుకున్న ఆయ‌న ఆదివారం ఉద‌యం కుటుంబ‌సభ్యుల‌తో హుషారుగానే మ‌ట్లాడార‌ని బురుండీ ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.   సోమవారం నాటికి కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. ఆ వెంటనే ఆయనకు గుండెపోటు వచ్చిందని, డాక్టర్లు ఆయన్ను కాపాడేందుకు విఫలయత్నం చేసినా ఫలితం లభించలేదని అధికారులు వ్యాఖ్యానించారు. 

IHG

ఇదిలావుండగా, ఆయన కరోనాతో మరణించారని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కురుంజియా భార్య డెనిస్ కు కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉన్న అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.దీంతో అధ్యక్షుడు ఎన్‌కురుంజిజా కూడా కరోనా కారణంగానే మృతిచెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. కాగా, ఇటీవలే ఎన్‌కురుంజిజా సతీమణి డెనిస్‌ ఎన్‌కురుంజిజాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కెన్యాలోని అగాఖాన్‌ యూనివర్సిటీ ఆస్ప‌త్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: