నారా లోకేష్ పాదయాత్రలో తెదేపా వాళ్లే కోడిగుడ్లు విసిరి మాపై చెప్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తెదేపా నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికే గవర్నర్ ను కలిశారన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏం విఘాతం ఏర్పడిందని గవర్నర్ దగ్గరకు వెళ్లారని.. తెదేపా నాయకులకి ఇది పరిపాటేనని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌, లోకేష్‌, చంద్రబాబు ఎంతమంది రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా పధకాలు అమలు చేస్తున్న జగన్ తోనే ప్రజలు ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమాగా చెప్పారు.

విపక్షాల నాయకులు ఎవరు ఎక్కడ తిరిగితే మాకేంటి అని ప్రశ్నించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నూటికి 98 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. ఓపిఎస్ సాధ్యం కాదని చెప్పామని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా మంచి ప్యాకేజి ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: