సాధారణంగా జిడ్డు చర్మం కలిగి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. జిడ్డు చర్మం కలిగి ఉన్నవాళ్లు బయట మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. అలానే ఎంత మేకప్ వేసుకున్న వాళ్ళకి జిడ్డు కారిపోతూనే ఉంటుంది . నిజంగా ఈ సమస్య నుండి బయటపడటం చాలా కష్టమని ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు చాలా బాధపడుతూ ఉంటారు.ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లకి వేసవికాలంలో ఎక్కువగా ఆక్నే వంటి సమస్యలు వస్తాయి. అలానే చెమట ఎక్కువగా పట్టి చర్మం పూర్తిగా చెమటలతో నిండిపోతుంది. చెప్పాలంటే వేసవి కాలంలో ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

సెబెమ్ గ్లాడ్.. సెబెన్ ప్రొడ్యూస్ చేసి చర్మాన్ని సాఫ్ట్,మాయిశ్చరైసర్ గా ఉంచుతుంది. ఒకవేళ కనుక ఎక్కువ సేపు ప్రొడ్యూస్ అయిపోతే అటువంటి సమయంలో చర్మం అంతా ఎక్కువ ఆయిల్ తో నిండిపోతుంది. అందుకోసమే అలాంటి వాళ్ళ కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆయిలీ స్కిన్ టిప్స్ :
ఆయిల్ స్కిన్ కలిగిన వారు ఒక స్పూన్ నిమ్మరసంలో కొంచెం ఆయిల్ కలుపుకొని ఈ రెండింటి మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని మొహానికి మంచిగా మర్దన చేయాలి. అలానే ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉంచాలి.  ఒక స్టీమర్ లేదా పాత్ర తీసుకుని అందులోకి కొన్ని నీళ్లు, పసుపు కలుపుకొని నీటిని మరిగించాలి. ఆ నీటి నుండి వచ్చిన ఆవిరిని ముఖానికి   పట్టుకోవాలి. ఇలా చేయడం వలన ముఖానికి జిడ్డు కారడం తగ్గుతుంది.

ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మీ ముఖాన్ని రోజుకు రెండు నుండి మూడుసార్లు కడుక్కోవడం మంచిది. దీనివల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, జిడ్డు వంటివి తొలిగిపోతాయి.దీంతో మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అందుకే ఆయిల్ చర్మం కలిగిన వాళ్లు ఎక్కువగా ముఖంపై శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే ఎటువంటి సమస్యలైనా దూరం అవుతాయి. లేకపోతే చర్మంపై మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: