పూర్వం రోజుల్లో వారి ఆహార అలవాట్లు,జీవనశైలి కారణంగా ప్రతి ఒక్క స్త్రీకి పొడవాటి జుట్టు ఉండేది.కానీ ఈరోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం అన్నది పెద్ద సమస్యగా మారింది.జుట్టు రాలిపోకుండా ఉండడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా,ఎలాంటి కెమికల్స్ లేని షాంపూలు వాడిన ప్రయోజనం లేక, తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.జుట్టు రాలుతుందని అనే ఆలోచన కూడా జుట్టు రాలడానికి దోహదపడుతుంది కావున ఒత్తిడి తగ్గించుకోవడం చాలా మంచిది.ఇలా జుట్టు రాలడం తగ్గించుకోవడానికి మన ఇంట్లో దొరికే కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.ముఖ్యంగా సన్నగా కనబడే చిరోంజి గింజలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.ఈ గింజల్లోని పోషకాలు ఏంటో,దీనితో ఎలాంటి చిట్కాలు చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..


చిరోంజి గింజలు చూడడానికి ఉలవలు లాగ కనిపిస్తాయి.మరియు దీనిని తెలుగులో సారపప్పు అంటారు.దీనిని ఎక్కువగా స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు.ఈ గింజలను తరుచూ తీసుకోవడం వల్ల,జుట్టు సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఇందులో ఎక్కువగా ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్ ఏ,బి పుష్కలంగా లభిస్తాయి. ఇందులో సాటిరేటెడ్ ఫ్యాట్స్,ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.జుట్టును దృఢపరచి,విరిగిపోకుండా నిరోధించడానికి ఉపయోగపడతాయి.
వీటిని తరుచూ తీసుకోవడం వల్ల జుట్టు మూలల్లోకి కూడా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
చిరోంజి గింజలను,కొబ్బరి నూనెలో వేసి,బాగా మరిగించి,చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల,జుట్టు పెరుగుతుంది.అంతేకాక ఈ మాస్క్ తో జుట్టుకు కండిషనింగ్‌ చేస్తుంది.

చిరోంజి గింజలు జుట్టు ఆరోగ్యానికే కాక జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.మరియు ఇందులోని విటమిన్ సి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.

చిరొంజి గింజలు తీసుకునే విధానం..

వీటిని రాత్రంతా నానబెట్టి,పరగడుపునే తినాలి.ఇలా 4 వారాల పాటు ప్రతిరోజు తినడంవల్ల జుట్టు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.కావున జుట్టు సమస్యలతో బాధపడేవారు,ఈ గింజలను తరచూ తినడం మరియు ఈ గింజలతో తయారు చేసే ప్యాకులు వేసుకోవడం వల్ల, ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది.మరియు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: