సినిమా ఇండస్ట్రీలో అని కాకుండా చాలామంది తమ తమ అభిరుచులకు అభిప్రాయాలకు తగ్గట్లుగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారాలు టెన్షన్ లు డబ్బు ఇవన్నీ కాకుండా తమ సొంత అభిరుచులకు తగ్గట్లుగా వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఆ విధంగా కొంతమంది పెంపుడు జంతువులను పెంచుకోవడం మనం చూస్తుంటాం. ముఖ్యంగా హీరోయిన్ లు పెంపుడు జంతువులను పెంచుతూ వాటి పట్ల తమ ప్రేమను తెలియజేస్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉండడం ఎలాగో మన హీరోయిన్ లకు ఈ కుక్కల పెంపకం అనేది కూడా ఒక అలవాటు. 

ఖాళీ సమయాల్లో వాటి తో ఆడుకుంటూ ఉంటారు. షూటింగ్ లో ఎప్పుడూ సందడిగా ఉండే వారు  ఇంట్లో ఉన్నప్పుడు పెంపుడు కుక్కలతో సరదాగా ఉండడం విశేషం. కరోనా సమయంలో కాస్త విరామం దొరకడంతో హీరోయిన్ లు వాళ్ల అలవాట్లకు పని చెబుతున్నారు. తమ సరదాలను తీర్చుకుంటూ సంతోషంగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. కుక్కలకు డ్రెస్సులు వేస్తూ వాటిని చూసుకుంటూ మురిసిపోతున్నారు. 

దాదాపు అందరు హీరోయిన్ లకు కుక్కలను పెంచే అలవాటు ఉంది. ప్రతి హీరోయిన్ కూడా పెంపుడు జంతువులపై తమ ప్రేమను చాటి చెబుతున్నారు. ఇటీవలే సమంత తన పెంపుడు కుక్క తో వాలీబాల్ ఆడుతూ వీడియోను షేర్ చేసింది. రష్మిక ఏకంగా తన పెంపుడు కుక్కకు ముద్దులు పెడుతూ కవ్వించింది. కీర్తి సురేష్ డ్రెస్సులు వేసి ఎంతో అందంగా పెళ్లి కూతురు గా తన పెంపుడు కుక్కలను తయారు చేసింది .అలాగే అనుష్క, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య, ఛార్మి లు కూడా ఖాళీ సమయాలలో తమకు తోడుగా పెంపుడు కుక్కలను పెంచుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. వాటితో ఉన్న క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తున్నారు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: