టాలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్టా చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'.మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథాయకుడిగా జీ స్టూడియస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. ఇక రాజకీయ, సామాజిక అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమాలో తేజు ఒక కలెక్టర్ పాత్రలో కనిపించగా..అతని సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. ఇక సీనియర్ నటుడు జగపతిబాబు తో పాటు రమ్యకృష్ణ సైతం ఇతర కీలక పాత్రల్లో నటించారు.ఇక అక్టోబర్ 1 (ఈ రోజు) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక తెలంగాణాలో కంటే ఏపీ లో ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాని...

 పలువురు సినీ ప్రముఖులు చూసి.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇక సినిమాలో తేజు నటన, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాలో చివరి 30 నిమిషాలు ఎంతో కీలకం. ప్రస్తుత సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా సఫలమయ్యాడనే చెప్పాలి.అన్ని సినిమాల మాదిరిగా రొటీన్ గా, సినిమాటిక్ వే లో కథను ముగించకపోవడం ఈ సినిమాకు మెయిన్ పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు.సమాజంలో అవినీతి అక్రమ వ్యాపారం అనే పాయింట్ కి ప్రస్తుత పరిస్థితులను జోడించి చెప్పిన విధానం చాలా బాగుంది.

రాజకీయ వ్యవస్థ నుండి బ్యూరోక్రాట్స్ ను వేరు చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చుననే కోణంలో రిపబ్లిక్ సినిముఖ్ను6దర్శకుడు దేవా కట్టా తీర్చిదిద్దిన విధానం తన దర్శకత్వ ప్రతిభను చాటి చెప్తుంది.ఇక సినిమాలో డైలాగ్స్ కూడా ప్రధాన పాత్ర పోషించాయి. కేవలం సాయి ధరమ్ తేజ్ పలికిన డైలాగులు మాత్రమే కాకుండా రమ్యకృష్ణ, జగపతిబాబు లాంటి నటీ నటులు పలికిన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి.మొత్తంగా చాలా కాలం తర్వాత దర్శకుడు దేవా కట్టా ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చేసిన 'రిపబ్లిక్' అనే ఈ సరికొత్త ప్రయత్నం మాత్రం చాలా వరకు సఫలం అయ్యిందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: