స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండవ కుమారుడు అని అందరికీ తెలిసిన విషయమే. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అనే నీడ నుంచి చిన్న చిన్నగా తప్పుకుంటూ ..తన నటనతో , డాన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా హీరో అనే నీడ నుంచి తప్పుకుంటూ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాస్తా ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొంది పాన్ ఇండియా లెవెల్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ కేవలం ఒక హీరో మాత్రమే కాదు ఒక కొడుకుగా, భర్తగా ,తండ్రిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.


ఇకపోతే అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2011 వరకు ప్రేమ పక్షుల్లా తిరిగిన వీరిద్దరూ చివరికి పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఒక ఇంటివారయ్యారు. స్నేహ తండ్రి సిచ్  ఇంజనీరింగ్ కాలేజెస్  ఫౌండర్ కే సీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం వీరి వివాహానికి ఒప్పుకోలేదు. కానీ దాదాపు సంవత్సరం పాటు ఎన్నో తిప్పలు పడినా వీరిద్దరూ చివరికి మధ్యవర్తుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ ,  మాస్టర్స్ డిగ్రీ తో పాటు ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ను పూర్తి చేసింది. ఇక ఇండియా వచ్చిన తర్వాత తమ సిచ్ కాలేజీ విస్తరణకు తనవంతు కృషిని చేసింది స్నేహ రెడ్డి. కాలేజ్ అకడమిక్ ప్లేస్మెంట్ డైరెక్టర్ గా తనదైన ముద్రను వేసుకుంది.

యువతను జాగృతం చేయడానికి స్పెక్ట్రమ్ అనే కాలేజీల కు సంబంధించిన మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తుంది. ఇక పోతే బన్నీ కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఇక వీరికి అల్లు అయాన్, అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: