
అయితే అల్లు అర్జున్, స్నేహ రెడ్డిలు లవ్ చేసుకొని ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2011 వరకు ప్రేమ పక్షుల్లా తిరిగిన చివరికి పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటైయ్యారు. ఇక స్నేహ తండ్రి సిచ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫౌండర్ కే సీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం వీరి వివాహానికి అంగీకారం తెలుపలేదు. ఆయనని ఒప్పించడానికి దాదాపు సంవత్సరం పాటు ఎన్నో తిప్పలు పడినా వీరిద్దరూ చివరికి మధ్యవర్తుల సహాయంతో వివాహం జరిపించారు.
స్నేహారెడ్డి అమెరికాలో కంప్యూటర్ సైన్స్ , మాస్టర్స్ డిగ్రీ తో పాటు ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివారు. ఆ తరువాత ఇండియా వచ్చి తమ సిచ్ కాలేజీ విస్తరణకు తనవంతు కృషిని చేసింది. అంతేకాదు.. కాలేజ్ అకడమిక్ ప్లేస్మెంట్ డైరెక్టర్ గా తనదైన ముద్రను వేసుకుంది స్నేహారెడ్డి. అలాగే యువతను జాగృతం చేయడానికి స్పెక్ట్రమ్ అనే కాలేజీలకు సంబంధించిన మ్యాగజైన్ కు చీఫ్ ఎడిటర్ గా కూడా విధులు నిర్వహిస్తుంది.
కానీ అల్లు అర్జున్ మాత్రం కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఈ దంపతులకు అల్లు అయాన్, అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్నేహారెడ్డి అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలుస్తూ అటు పిల్లల బాధ్యతలను కూడా చేపడుతూ మరొకవైపు తన సొంత వ్యాపారాలను చూసుకుంటూ అందరిచేత ప్రశంసలు అందుకుంటుంది.