
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైగర్'. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ మూవీ కోసం విజయ్ బీస్ట్‌లా మారిపోయాడు. రోజూ గంటలకొద్ది వర్కవుట్లు చేసి బాడీ బిల్డ్ చేశాడు. థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అయితే 'లైగర్' షూటింగ్ పూర్తవగానే ఈ లుక్ నుంచి బయటపడే కార్యక్రమం మొదలుపెట్టాడు. సోల్జర్‌గా నటిస్తోన్న 'జెజిఎమ్' సినిమా కోసం బరువు తగ్గుతున్నాడు. అలాగే హెయిర్ స్టైల్ కూడా మార్చాడు.
రవితేజ రాబిన్‌హుడ్ తరహా పాత్ర పోషిస్తోన్న సినిమా 'టైగర్ నాగేశ్వర్రావు'. వంశీ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో రవితేజ సరికొత్తగా కనిపిస్తాడని సినీ వర్గాల నుంచి సమాచారం. 1970ల్లో స్టువర్టుపురం ఏరియాలో ఘరానా దొంగతనాలు చేసిన నాగేశ్వర్రావు కథాంశంతో తెరకెక్కుతోంది ఈ సినిమా.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో చేస్తోన్న సినిమా 'దసరా'. గోదావరి ఖని ఏరియాలో కోల్ మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న ఈ సినిమాలో నాని ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఈ క్యారెక్టర్‌కి తగ్గట్టు జుట్టు పెంచాడు. గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. అలాగే తెలంగాణ మాండలికం కూడా నేర్చుకున్నాడు నాని.
రామ్ చాక్లెట్ బాయ్ లుక్స్‌కి ఫీమేల్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. లవ్‌స్టోరీస్‌తో ఫీమేల్ ఆడియన్స్‌ని మెప్పించే ఈ హీరో 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత 'ది వారియర్' సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కోసం మీసాలు పెంచాడు. అలాగే బాడీ కూడా బిల్డ్ చేశాడు. ఇక బోయపాటి శ్రీను ప్రాజెక్ట్‌లోనూ మజిల్డ్ బాడీతోనే కనిపిస్తాడని చెప్తున్నారు.
అఖిల్ మాసీ యాక్షన్ హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌తో పాటు బీ, సీ సెంటర్స్‌లోనూ స్టార్డమ్ సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ సిసింద్రీ ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. ఈ లోటు పూడ్చుకోవడానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ బాడీ బిల్డ్ చేసి, హృతిక్ రోషన్‌లా స్టైలిష్ స్టార్‌గా మారాడు. 'ఏజెంట్' స్టిల్స్‌తోనే సినిమాపై బజ్ పెరిగింది.