కాజల్‌ అగర్వాల్‌కి కొడుకు పుట్టాక సినిమాలకి బ్రేక్ ఇస్తుందని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. చెల్లెలు నిషా అగర్వాల్ లాగే అక్క కాజల్‌ కూడా ఫ్యామిలీ లైఫ్‌తో బిజీ అవుతుందనే మాటలు వినిపించాయి. కానీ చందమామ మాత్రం సినిమాలకి బ్రేక్‌ ఇవ్వడం లేదు. కొడుకు పుట్టిన రెండు నెలలకే ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టింది. మునుపటి లుక్‌లోకి వెళ్లిపోయి సినిమాలకి రెడీ అయింది.  

కాజల్‌ సోషల్‌ మీడియాలో క్యూట్‌ ఫోటోలు పోస్ట్‌ చేసి, రీఎంట్రీకి రెడీ అని హింట్స్‌ ఇస్తోంది. పైగా సీనియర్ హీరోలకి సరైన హీరోయిన్స్‌ని వెతకడం మేకర్స్‌కి కూడా కష్టమైపోతోంది. దీంతో సీనియర్ హీరోల సినిమాలతో చందమామ మరికొంత కాలం కెరీర్‌ కంటిన్యూ చేస్తుందని చెప్పొచ్చు.  

కాజల్‌కి అనుష్క శర్మ ఇన్సిపిరేషన్‌ అని చెప్పొచ్చు. అనుష్క కూతురు పుట్టిన రెండు నెలలకే సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్‌గా బిజీ అయ్యింది. ప్రస్తుతం ఇండియన్ ఫాస్ట్ బౌలర్‌ జులన్‌ గోస్వామి లైఫ్ హిస్టరీతో సినిమా చేస్తోంది. 'చక్‌ద ఎక్స్‌ప్రెస్'తో పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

హీరోయిన్లు ఫార్టీ క్రాస్‌ చేస్తే గ్లామర్‌ రోల్స్‌కి సెట్ అవ్వరనే ఒపీనియన్ ఉంది. అందుకే అక్క, వదిన లాంటి సపోర్టింగ్‌ రోల్స్‌ ఇస్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఫార్టీస్‌లోనూ యంగ్‌లుక్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ లుక్‌తోనే ఇప్పటికీ హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటున్నారు.

కరీనా కపూర్‌ పర్సనల్‌ లైఫ్, ప్రొఫెషనల్‌ లైఫ్ రెండిటిని బ్యాలెన్స్‌ చేస్తోంది. 41 యేళ్ళ వయసులోనూ ఇద్దరు కొడుకులు పుట్టాక కూడా హీరోయిన్‌గా ఆఫర్స్ అందుకుంటోంది. రెండో కొడుకు కడుపులో ఉన్నప్పుడు 'లాల్‌ సింగ్‌ చడ్డా'కి సైన్‌ చేసింది. కొడుకు పుట్టాక కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది.

హీరోయిన్లకి 48 ఏళ్లు వస్తే జనరల్‌గానే మదర్ క్యారెక్టర్స్‌కి షిప్ట్ అయిపోతుంటారు. కానీ ఐశ్వర్యా రాయ్‌ మాత్రం ఈ ఏజ్‌లోనూ లీడ్‌ రోల్స్‌ అందుకుంటోంది. బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తోంది. 'ఏ దిల్‌ హై ముష్కిల్‌'లో అయితే వయసులో చిన్నోడితో ప్రేమలో పడే పాత్ర చేసింది. ఇక ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' చేస్తోంది. అలాగే రజనీకాంత్‌తో ఒక సినిమాకి కమిట్‌ అయింది. మాధురి దీక్షిత్‌ ఇప్పటికే ఫిఫ్టీ క్రాస్‌ చేసింది. ఈమె పిల్లలు కూడా కాలేజ్‌లో అడుగుపెట్టారు. అయినా మాధురికి ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈమెకి లీడ్‌ రోల్స్‌ వస్తున్నాయి. కొంతమందైతే స్పెషల్‌ సాంగ్స్‌కి కూడా తీసుకుంటున్నారు. మాధురి మేజిక్స్ నుంచి బయటపడ్డం కష్టమని స్టేట్ మెంట్స్ కూడా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: