
రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్'తో పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. రాజమౌళి బ్రాండ్‌తో నార్త్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ ఫిల్మ్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందీ సినిమా. 'సర్కారోడు, అధికారి' అనే టైటిల్స్ వినిపిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు మేకర్స్.
'ఆర్ ఆర్ ఆర్'తో పాన్ ఇండియన్ మార్కెట్‌కి వెళ్లిన జూ.ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్‌లో మల్టీలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. నేషనల్ లెవల్‌లో రిపేర్ చేస్తామని యాక్షన్ టీజర్ రిలీజ్ చేసి అభిమానుల్లో అంచనాలు పెంచాడు. 'జనతాగ్యారేజ్' తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తారనే టాక్ వస్తోంది.
మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 12 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా వస్తోంది. 'అతడు, ఖలేజా' తర్వాత వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. అనౌన్స్‌మెంట్‌తోనే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమాని సంక్రాంతి పందెంలో దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు నాలుగు భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతున్నాయి. వీటిల్లో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఇక మహేశ్ బాబు సినిమాకి కూడా 70 నుంచి 90 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ట్రేడ్ టాక్. అయితే ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలు నెక్ టు నెక్ ఫైటింగ్‌కి దూరంగా ఉంటున్నాయి. ఓపెనింగ్స్ డివైడ్ అవుతాయని పోటీకి నో చెప్తున్నారు. మరి ఈ లెక్కలతో ఎన్ని సినిమాలు సంక్రాంతి నుంచి తప్పుకుంటాయో చూడాలి.