
ఎంతోమంది ప్రముఖ దర్శకుల సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించింది. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక డాన్స్ విషయంలో హీరోయిన్లను మించిపోయి పెర్ఫామెన్స్ చేస్తూ ఉంటుందని ఎంతోమంది హీరోలు కూడా హీరోయిన్ లకు కూడా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.అయితే డ్యాన్స్ షో తో వెలుగులోకి వచ్చిన ఈమె అదే డ్యాన్స్ షోపై పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సాయి పల్లవి చేసిన వాఖ్యలు పలు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇక టీవీ డ్యాన్స్ రియాల్టీ షోలపై సాయి పల్లవి చాలా అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. టీవీ చానల్స్ లో డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని.. అంతేకాకుండా ప్రముఖుల వారసులకే మర్యాద గౌరవం దక్కుతుందని ఆమె అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే తనకు డ్యాన్స్ రియాలిటీ షోల పైన నమ్మకం లేదని.. ఈ డ్యాన్స్ షో లు అంటే తనకి అసహ్యం అని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.