సౌత్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీల మధ్య ఇప్పుడు డబ్బింగ్ చిత్రాల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సంక్రాంతికి రాబోతున్న తమిళ డబ్బింగ్ చిత్రాలకి ఎక్కువ థియేటర్లో ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో డైరెక్ట్ గా తెలుగు చిత్రాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మాతల మండలి ప్రకటించడంతో వివాదం కాస్త మొదలైంది. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఇదే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. తెలుగు చిత్రాలకు తమిళనాడులో ఆశించిన స్థాయిలో థియేటర్లు ఇవ్వరనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం స్ట్రైట్ తెలుగు చిత్రానికి రెండు డబ్బింగ్ సినిమాలు పోటీగా నిలవడం మరింత చర్చనీయాంశంగా మారింది. తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" సినిమా ఇటీవల రన్ టైం పూర్తిచేసుకుంది.  131 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. జి స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.  అయితే ఇదే రోజున "లవ్ టుడే",  "తోడేలు" వంటి రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. తమిళ్లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన లవ్ టుడే సినిమాను తెలుగులో అగ్రనిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో గురించి పెద్దగా ఎవరికి తెలియకపోయినా డబ్బింగ్ చిత్రానికి ప్రాముఖ్యత ఇస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 400 స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారని సమాచారం.


అలాగే తోడేలు వంటి హిందీ డబ్బింగ్ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా రిలీజ్ చేస్తున్నారు.  గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అంటే థియేటర్ల కేటాయింపు కూడా ఎక్కువగానే ఉంటుంది.  ఇలా దిల్ రాజు , అల్లు అరవింద్ లాంటి ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు తీసుకొస్తున్న రెండు డబ్బింగ్ సినిమాలతో అల్లరి నరేష్ పోటీ పడాల్సి వస్తోంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనేది సోషల్ డ్రామాగా వస్తోంది.. లవ్ టుడే అనేది న్యూ ఏజ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. తోడేలు సినిమా ఒక క్రీచర్ కామెడీగా వస్తున్నాయి. ఇలా వేటికవే ప్రత్యేకమైన జోనర్ ల్లో రూపొందుతున్న నేపథ్యంలో నరేష్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: