తెలుగు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'.. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని యావత్ మెగా ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. మెగాస్టార్ కు గట్టి పోటీని ఇస్తూ మాస్ మహరాజా రవితేజ ఈ సినిమాలో నటించారు. డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.. ఇందులోని పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల అయిన పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది.


రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అనడం హైప్ ను క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది..పూనకాలు పాటలో చిరు వేసి షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక చక్కర్లు కొడుతున్నాయి.


ఆ పాటలో చిరు ఎరుపు రంగు పూల చొక్కా ధరించి మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఆ షర్ట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా ఓ సంబంధం ఉంది. చెర్రీ కూడా అచ్చం అలాంటి షర్ట్ నే ధరించి ఓ యాడ్ లో కనిపించాడు. చిరు వేసిన షర్ట్  చరణ్ ది అంటూ తెగ ప్రచారం జరుగుతుంది..ఇకపోతే పూనకాలు లోడింగ్ సాంగ్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా ఉందుంటున్నారు అభిమానులు... శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. చిరంజీవి, రవితేజల బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా ఉపయోగించాడు. ఆయన మాస్ లుక్ ఆడియన్స్ను ఎలా ఆకర్షిస్తుందో చూడాలి..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: