టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలు పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేక పోతున్నాయి. ముఖ్యంగా నటన విషయంలో చిరంజీవి పై నెగిటివ్ కామెంట్స్ ఏవి రాకపోయినప్పటికీ కంటెంట్ పాత తరహాలో ఉండడంతో పెద్దగా ప్రేక్షకులు సినిమాల పైన ఫోకస్ను తగ్గించేశారు.


ఇప్పటికే కూడా చిరంజీవి తన పాత స్టైల్ లోనే సినిమాలను తెరపైకి తీసుకువస్తూ ఉండడం గమనార్హం. చిరంజీవి గత నాలుగు సినిమాలకు సంబంధించి బిజినెస్ విషయానికి వస్తే.. అలాగే వాల్తేర్ వీరయ్య బిజినెస్ సినిమా విషయం ఎలా జరిగిందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఖైదీ నెంబర్ 150 సినిమాకి రూ.89 కోట్ల రూపాయల వరకు థీయేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా కూడా టార్గెట్ ను తొందరగానే పూర్తి చేసింది. ఆ తర్వాత పాన్ ఇండియా వైరుగా విడుదలైన సైరా నరసింహారెడ్డి రూ.195 కోట్ల రూపాయలు బిజినెస్ జరగదు ఈ సినిమా చాలా ఏరియాలలో నష్టాలను కూడా మిగిల్చింది.


ఇక తర్వాత ఆచార్య సినిమా రూ.136 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగగా.. దాదాపుగా రూ .90 కోట్ల రూపాయల వరకు నష్టం మిగిల్చినట్లు సమాచారం.  గాడ్ ఫాదర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కూడా రూ .90 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగగా.. ఈ సినిమా టార్గెట్ ఇంకా పూర్తి చేయలేక పోయింది. స్వల్ప నష్టాలతో ఈ సినిమా మిగిలింది. ఇక వాల్తేర్ వీరయ్య సినిమా విషయానికి వస్తే.. రూ.88 కోట్ల రూపాయల వరకు బిజినెస్. మరి ఈ టార్గెట్ ను చిరంజీవి పూర్తి చేస్తారో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: