రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా ఏకంగా 220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిరంజీవి కెరీర్లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కోల్‌కతా సెట్ ని కూడా వేశారు. అందులోనే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చూడాలని ఉంది సినిమాలోని ఆల్ టైం క్లాసిక్ సాంగ్ అయిన రామ్మా చిలకమ్మ పాటను రీమిక్స్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. అప్పుడు మణిశర్మ ఆ సినిమాకు అదిరిపోయే సంగీతం అందిస్తే ఇప్పుడు భోళా శంకర్ సినిమాకు ఆయన కొడుకు మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.


ఇక చూడాలని ఉంది సినిమా కూడా కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లోనే వచ్చింది. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మెహర్ రమేశ్‌ సినిమా కూడా కోల్ కత్తా నేపథ్యంలోనే వస్తుంది. సిచువేషన్ కూడా కలవడంతో రామ్మా చిలకమ్మా పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేశారని సమాచారం తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులతో వింటేజ్ మెగాస్టార్ ను గుర్తు చేసినట్టు ప్రచారం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే భోళా శంకర్ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.ఇంకా ఈ సినిమా సమ్మర్ తర్వాత విడుదల కానుంది. కీర్తి సురేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్‌, కె ఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.మరి ఈ సినిమా చిరుకి ఎలాంటి భారీ విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: