సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం చాలా మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలా దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి ఈ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఆ తరువాత అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ సక్సెస్ ను ఈ దర్శకుడు అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఏనిమల్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఏనిమల్ మూవీ సెట్స్ పై ఉండగానే సందీప్ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలను ఓకే చేస్తూ వెళ్తున్నాడు. 

అందులో భాగంగా చాలా రోజుల క్రితమే సందీప్ ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక మూవీ ని చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇలా ఏనిమల్ మూవీ సెట్స్ పై ఉండగానే సందీప్ అదిరిపోయే రేంజ్ ఉన్న ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లతో తన తదుపరి మూవీ లను చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: