
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ బయటికి రావడం జరిగింది.ఈ చిత్రంలో నటుడు మంచు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. అయితే ఆయన ఈ సినిమాలో దుర్వాసముని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఆయనకు సంబంధించి ఒక లుక్కును విడుదల చేయడం జరిగింది. దుర్వాసముని పాత్రలో మోహన్ బాబు బాగా సెట్ అయ్యారని ఈ సినిమాలో ఇదే కచ్చితంగా ప్లస్ అవుతుందని భావిస్తున్నట్లుగా తెలియజేశారు. ముఖ్యంగా మెడలో రుద్రాక్ష మాల ఒక చేతిలో చెంబు మరొక చేతిలో యోగ దండం ఇలా అన్నిటిలో కూడా ఆయన అదిరిపోయారని తెలిపారు.

గతేడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలవల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. తెలుగుతో పాటు హిందీ ,తమిళ్ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. నీలిమ గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతిధి బాల, అల్లు అర్హ ,వర్షిని తదితరులు నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సాయి మాధవ్ బుర్ర రచన సహకారం అందించారు ఈ సినిమా కూడా సమంతను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గుణశేఖర్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లుగా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది.