టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడుగా కొనసాగుతున్నారు త్రివిక్రమ్.ఇక ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఏ రెంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో హీరోయిన్గా నటించిన హీరోయిన్ల చాలామంది ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. అందులో చూసుకుంటే సమంతా పూజా హెగ్డే సంయుక్త మీనన్ ఇలా చాలామంది స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్లారు. అయితే తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ మాత్రం తన కెరియర్

 త్రివిక్రమ్ నాశనం చేశారంటూ త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలను చేసింది. ఇక ఆమె ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ ప్రేమ. అప్పటిలో ఈమె హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించింది .హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది ప్రేమ .అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ఇక ఇంటర్వ్యూలో భాగంగా త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలను చేసింది ప్రేమ. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ త్రివిక్రమ్ వల్ల తన సినీ కెరియర్ నాశనం అయిందంటూ త్రివిక్రమ్ పై ఆరోపణలను చేసింది.

త్రివిక్రమ్ వల్లే తాను స్టార్ హీరోయిన్ కాలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిరునవ్వుతో సినిమాలో ముందుగా ప్రేమను హీరోయిన్గా అనుకున్నారట. ఇక ఆ సినిమాలో హీరోగా నటించారు వేణు తొట్టెంపుడి. అయితే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ను ముందుగా నెగిటివ్ గా చూపించారు. వేరే వ్యక్తితో లేచిపోయి పెళ్లి చేసుకొని చివరకు మారిపోయే అమ్మాయిగా ఆమెను డిజైన్ చేశారు .అందుకే త్రివిక్రమ్ వల్ల తన సినీ కెరియర్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోయిందంటూ తెలిపింది ప్రేమ. దీంతో ప్రేమ త్రివిక్రంపై చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: