విజయ్ దేవరకొండ సమంత ఇద్దరు కూడా ప్రస్తుతం టర్కీలో తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.సమంత విజయ్ దేవరకొండ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఖుషి.

సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను అయితే జరుపుకుంటుంది. ఇప్పటికే కేరళ హైదరాబాద్ కాశ్మీర్ వంటి ప్రాంతాలలో షూటింగ్ పనులు జరుపుకున్న చిత్ర బృందం ప్రస్తుతం టర్కీ కి వెళ్లారు. టర్కీలో విజయ్ దేవరకొండ సమంత కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే టర్కీలో ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా విరామ సమయంలో సమంత విజయ్ దేవరకొండ టర్కీ వీధులలో తిరుగుతూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే టర్కీ కి సంబంధించిన కొన్ని ఫోటోలను  సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇలా టర్కీ అందాలను చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా భారీగా వీరు సినిమాని ఇలా ప్రమోట్ చేస్తూ కూడా వచ్చారు. ఇక విజయ్ దేవరకొండ టర్కీలో ఫుడ్ టెస్ట్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకులని పలకరించ బోతుంది.. ఈ సినిమా కంటే ముందుగానే సమంత నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చారు.

సినిమా కూడా విజయ్ దేవరకొండను కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.ఇలా ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన ఈ ఇద్దరు ఖుషి సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా వీరిద్దరికీ ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: