తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరు పొందింది నయనతార.. కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. సరిగ్గా ఏడాది క్రితం నయనతార ,విగ్నేశివన్న ప్రేమించి మరి వివాహం చేసుకున్నరు. నేడు వీరి వివాహ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేయడం జరిగింది.. నయనతార మరియు విగ్నేష్ ల యొక్క ప్రేమ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నాలుగైదులుగా ప్రేమించుకొని ఆ తర్వాత వివాహం చేసుకున్న వీరు ఆ వెంటనే సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. వీరి ఫోటోలను మాత్రం ఇంతవరకు రివిల్ చేయలేదు..


తాజాగా తమ యానివర్సిరీ సందర్భంగా నయనతార దంపతులు తమ పిల్లల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో నయనతార తన ఇద్దరు పిల్లలను గుండెకు హత్తుకొని ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మొదటిసారి నయనతార తన పిల్లలను చూసేందుకు ఇదే మంచి సమయము అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అక్టోబర్ 9న సర్వసద్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట ఫస్ట్ టైం వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడంతో వీరి పిల్లల ముఖాలను కూడా రీవిల్ చేయడం జరిగింది.


ప్రస్తుతం నయనతార విజ్ఞేశ్ స్వయంగా  సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం నయనతార లేడీ ఓరియంటెడ్ చిత్రాల పైన నటిస్తూనే.. పలు హీరోల చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది .ఇతర భాషలలో సైతం నటిస్తున్న నయనతార చిత్రానికి ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: