ఇక భారతదేశంలో పనిచేస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ ఇచ్చే గుడ్ న్యూస్. 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ బకాయిపై మోడీ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. కరువు భత్యం ప్రస్తుతం 31 శాతం వుంది . ఈ ఏడాది జులైకి ముందు 17 శాతం ఉండగా, 2020లో స్తంభింపజేయగా.. 28 శాతానికి ఆపై 31 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే, జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు డియర్‌నెస్ అలవెన్స్ బకాయిలు అనేవి అందలేదు. కేబినెట్ సెక్రటరీతో జరిగే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఈ నెలాఖరు లోగా క్యాబినెట్ సెక్రటరీతో సమావేశం జరిగే అవకాశం ఉందని, అందులో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. కేంద్ర ఉద్యోగులకు డీఏ బకాయిలు ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం జూలైలో స్పష్టం చేయడం జరిగింది. అయితే నిత్యం డిమాండ్‌తో పాటు పెన్షనర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తుండటంతో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవచ్చునట.

ఉద్యోగుల 18 నెలల బకాయిలకు సంబంధించి, కౌన్సిల్ డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు 31% డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు అనేక పెద్ద ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ బకాయిల సమస్య అనేది ఇంకా పరిష్కారం కాలేదు. జేసీఎం సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా కూడా నిరంతరంగా బకాయిలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అలాగే 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేయాలనే డిమాండ్ కూడా ఇక్కడ ఉంది. ఇక ఈ అంశంపై డిసెంబర్‌లో క్యాబినెట్ సెక్రటరీతో చర్చించే అవకాశం కూడా ఉంది.పింఛనుదారులకు డీఆర్‌ నిలిపివేత నిర్ణయం సరికాదని ఇండియన్‌ పెన్షనర్స్‌ ఫోరమ్‌ అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. పింఛనుదారుల జీవనోపాధికి డబ్బు చాలా ముఖ్యమని, దాన్ని ఆపడం పింఛనుదారులకు శ్రేయస్కరం కాదని లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: