ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస పెట్టి నటించిన ఆ హీరోయిన్ తన డ్యాన్సులతో అదర గొడుతూ.. తన కొంటు లుక్స్‌తో కవ్వించేది. వెండితెరపై ఆమె కొంటె వేషాలకు తెలుగు సినిమా కుర్రకారుకి మతిపోయేది. హైదరాబాదీ మూలాలున్న ఈ అమ్మడు అటు ముంబై పరిశ్రమలోనూ పెద్ద స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది. కెరీర్ పరంగా పీక్స్‌లో ఉండగానే టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడి ఆ హీరోను చాలా ఘాడంగా ప్రేమించింది.
ఈ క్రమంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అనేంత వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆ స్టార్ హీరోతో ఎఫైర్ వార్తలు తన కెరీర్ ని నిండా ముంచాయన్న ఆవేదనను సదరు నాయిక పదే పదే మీడియా ముఖంగానే వెల్లడించేది. కట్ చేస్తే ఇప్పుడు ఆమె మరోసారి ఆ హీరోతో ఎఫైర్ మ్యాటర్‌పై స్పందించింది. తాను తమిళ్ పరిశ్రమకు వెళ్లిపోవడానికి ప్రధాన కారణం ఈ రూమర్లే అని వాపోయింది. ఇక ఆ హీరోయిన్‌తో ఎఫైర్ అన్న ప్రచారం సాగడంతో ఆ స్టార్ హీరో కూడా తనకు దూరమైపోయాడు.
ఇక ఇప్పుడు పెళ్లయ్యి ఓ బిడ్డకు జన్మనిచ్చాక కూడా సదరు సీనియర్ హీరోయిన్ పాత విషయాలు ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేయడంతో సదరు స్టార్ హీరో ఫ్యాన్స్ ఆమెపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలే మనోడికి కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. ఇలాంటప్పడు ఇలా మీడియా ముందుకొచ్చి పాత విషయాలు కెలకడం సరైనదేనా? అని హీరో గారి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.