పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారుండారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకులకు పండుగ అనే చెప్పాలి. మరి ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే తాజాగా ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అది ఏంటో తెలుసుకుందాం.
 
హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఓ సినిమా మరోసారి తెరపైకి రానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా సెప్టెంబర్ 2న థియేటర్ మరోసారి రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బద్రి సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ లో మంచి హిట్ తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రేణు దేశాయ్ నటించారు. ప్రకాశ్ రాజ్ ఈ మూవీలో ముఖ్యపాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా రీరిలీజ్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

 
ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG'  సినిమాను rrr ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: