మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్ డేట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఇప్పటికే ఎంపిక కాగా విక్రమ్ సైతం ఈ సినిమాలో నటిస్తారని వార్తలు వినిపించాయి. అయితే మహేష్ సినిమాను జక్కన్న మల్టీస్టారర్ గా మారుస్తున్నారా అనే చర్చ్ జరుగుతుంది.
 
ప్రధాన నటీనటుల పాత్రలకు మరీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే హీరో పాత్రకు ప్రాధాన్యత తగ్గుతుందేమో అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం దాదాపుగా నాలుగేళ్ల సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ ఒక సినిమా కోసం ఇంత సమయం కేటాయించడం ఏంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
 
మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండాలని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రికార్డులు క్రియేట్ చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారనే సంగతి తెలిసిందే.
 
మహేష్ బాబు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలను తెరకెక్కించడానికి డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నరు. త్వరలో మహేష్ బాబు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మహేష్ బాబు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: