పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎట్టకేలకు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. త్వరలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ లో సైతం పాల్గొననున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఓజీ సినిమా తాజాగా సెట్స్ పైకి వచ్చిందని సమాచారం అందుతోంది. స్టూడియోలో వేసిన సెట్ లో తాజాగా చిన్న షెడ్యూల్ ను పూర్తి చేశారని తెలుస్తోంది.
 
ముంబైలో కొత్త షెడ్యూల్ జరగబోతుందని సమాచారం అందుతోంది. పవన్ 15 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉందని అన్ని డేట్స్ సాధ్యం కాని పక్షంలో వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా. ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ ఓజీ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తే సెప్టెంబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
 
అఖండ సీక్వెల్ కు పోటీగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఓజీ సినిమా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటి అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఓజీ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఓజీ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అద్భుతంగా ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమా ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా మూవీగా ఓజీ రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: