
సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో నటసింహం నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్‌లో అలరించబోతున్నారు. ప్రస్తుతం జైలర్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇంతలోనే రజనీకాంత్ మరో స్టార్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో బలంగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు హెచ్. వినోద్. `ఖాకీ` మూవీతో తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వినోద్.. ఆ తర్వాత `వలిమై`, `తునివు` వంటి సాలిడ్ హిట్స్ ను సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం తమిళ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ తో `జన నాయగన్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే వినోద్ రెండుసార్లు రజనీకాంత్ ను కలిసారట. ఈ కలయికల్లోనే రజనీకాంత్, హెచ్. వినోద్ కాంబో మూవీ సెట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా ఈ క్రేజీ కాంబో కుదిరితే రజనీ ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయమనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు