సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం జైలర్ అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రజినీ కాంత్ కు భార్య పాత్రలో నటించగా ... తమన్నా , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. 2023 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో కన్నడ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ , మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన మోహన్ లాల్ , హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన జాకీ శార్ఫ్ చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు.

ఈ సినిమాకు శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ ,  జాకీ శర్ఫ్ ద్వారా కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం జైలర్ మూవీ కి కొనసాగింపుగా జైలర్ 2 అనే మూవీ ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా నెల్సన్ దిలీప్ కుమార్ సేమ్ జైలర్ మూవీ ఫార్ములానే ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... జైలర్ 2 మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ చిన్న కామియో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో ఇప్పటికే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో చిన్న క్యామియో పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షారుక్ ఖాన్ కూడా ఈ మూవీ లో నటించినట్లయితే ఈ మూవీ పై హిందీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: