సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను వచ్చే వారం విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

దానితో ఈ సినిమా మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కూలీ సినిమాలో నటిస్తూనే రజినీ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. జైలర్ మూవీ మంచి విజయం సాధించడంతో జైలర్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో నందమూరి నట సింహం బాలకృష్ణ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొంత మంది అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న రజిని తన తదుపరి మూవీ ని కూడా ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. రజినీ తన తదుపరి మూవీ ని హెచ్ వినోద్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినోద్ , దళపతి విజయ్ హీరో గా రూపొందుతున్న జన నాయగన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే రజనీ కాంత్ హీరోగా వినోద్ మూవీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: